![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -429 లో....కావ్య, అప్పు ఇద్దరు అసలు మాయ కోసం తనని వెతుక్కుంటూ వెళ్తారు. అప్పుడే మాయ ఇంటికి వస్తుంది.ఇంటి దగ్గరున్నా అప్పు, కావ్యలని చూసిన మాయ భయంతో పరుగెడుతుంది. మాయ పరుగెడుతుంటే తన వెంటే కావ్య, అప్పులు వెళ్తారు. మరొకవైపు కావ్య, అప్పులని ఫాలో అయిన రుద్రాణి.. అసలు మాయ వీళ్ళకి దొరికితే ప్రాబ్లమ్ అని మాయకు రుద్రాణి ఆక్సిడెంట్ చేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కావ్య అప్పులు తనని హాస్పిటల్ కు తీసుకొని వెళ్తారు.
మరొకవైపు అనామికని ధాన్యలక్ష్మి కొడుతుంది. నువ్వు గొప్పింటి నుండి వచ్చావ్.. ఇలా చేస్తావనుకోలేదు. నీకు అవసరం ఉంటే నీకు ఎంతైనా డబ్బులు ఇచ్చేదాన్ని కదా అని తిడుతుంది. తిడితే తిట్టింది గాని నాకు చెక్కు అయితే ఉందని అనామిక అనుకుంటుంది.ఆ తర్వాత మాయతో ఎవరో మాట్లాడి వెళ్తుంటే.. రాజ్ చూసి అతన్ని పట్టుకొని మాయ గురించి అడిగి తెలుసుకుంటాడు. మాయ గురించి అన్ని నిజాలు తెలుసుకుంటాడు. మాయ దగ్గరకు వెళ్లి నీ పేరు చిత్ర.. మీ నాన్న డబ్బులు ఎత్తుకొని వెళ్ళాడు. అతన్ని పోలీసులు వెతుకుతున్నారు. ఆ డబ్బులు గురించి ఇక్కడికి వచ్చావని తెలుసు.. నీకు డబ్బులు ఇస్తే మీ నాన్నకు ఏం ప్రాబ్లమ్ లేదు.. అంతేనా నువ్వు రాత్రికి రాత్రి వెళ్లిపోతే.. మంచిది లేదంటే మీ నాన్న అడ్రెస్ కనుక్కొని పోలీసులకి పట్టిస్తానని మాయకు రాజ్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత అసలు మాయ ఆ సిచువేషన్ లో ఉన్నందుకు కావ్య ఫీల్ అవుతుంది. అత్తయ్య మా ఆయనకు మాయకి రేపే పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఈ టైమ్ లో మాయ చెప్పే నిజాలు నాకు ముఖ్యమని కావ్య బాధపడుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళు మాయ స్పృహలోకి వస్తే నేను కాల్ చేస్తానని అప్పు చెప్పగానే కావ్య ఇంటికి వెళ్తుంది.
కావ్య ఇంటికి రాగానే.. నువ్వు వెళ్లిన పని ఏమైందంటూ రుద్రాణి వెటకారంగా మాట్లాడుతుంది. నేను అనుకున్నది సాధిస్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య లోపలికి వెళ్తుంది. లోపల మాయ, రాజ్ ల పెళ్లి కోసం బట్టలు సెలక్ట్ చేస్తుంటారు. తరువాయి భాగంలో మాయ ఇంటి నుండి వెళ్ళడానికి రెడీ ఆవుతుంది. అప్పుడే రుద్రాణి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |